Supriya Sule | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)పై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు సమయానికి (Flight Delay) రావట్లేదని ఇటీవలే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. శుక్రవారం రాత్రి తాను ప్రయాణించాల్సిన విమానం దాదాపు గంటకుపైగా ఆలస్యమైనట్లు (Flight Delay) తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
‘ఎయిర్ ఇండియా విమానం మరోసారి ఆలస్యమైంది. రాత్రి 10:30 గంటలకు విమానం రావాల్సి ఉంది. అయితే గంట ఆలస్యమైంది (11:30 గంటలకు). ఆ తర్వాత రాత్రి 11:45 గంటలకు వచ్చింది. ఎప్పుడో ఒకసారి ఇలా జరగడం లేదు. ప్రతీసారీ ఇలానే విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఈ కారణంగా ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. విమానాలు తరచూ ఆలస్యంగా వస్తుండటంతో ప్రయాణికులు (Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది. విమానాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఈ పోస్ట్న ట్యాగ్ చేసింది. అయితే, విమాన వివరాలను మాత్రం సుప్రియా సూలే వెల్లడించలేదు.
At Delhi Airport, experiencing yet another delay by Air India. Flight was scheduled for 10:30 PM, delayed to 11:30 PM, and now further pushed to 11:45 PM. Passengers are stranded and visibly distressed. This isn’t an isolated case—it’s becoming a troubling norm. Urging the…
— Supriya Sule (@supriya_sule) May 2, 2025
కాగా గతంలో కూడా ఎయిర్ ఇండియా సేవలపై సుప్రియా సూలే తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానాలు సమయానికి (Flight Delay) రావట్లేదని ఆమె ఆరోపించారు. తాను గంటలకుపైగా వేచి ఉండాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేం ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తాము.. అయినప్పటికీ విమానాలు సమయానికి రావు. ఆలస్యం కారణంగా పిల్లలు, సీనియర్ సిటిజన్స్, నిపుణులు ఇలా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన AI0508 విమానంలో ప్రయాణించా. దీని కోసం గంట 19 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి. విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి’ అని ఆమె ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆమె మాత్రమే కాదు పలువురు కేంద్ర మంత్రులు, నేతలు సైతం విమానాల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Also Read..
Russias Victory Day Parade | రష్యా విక్టరీ డే వేడుకలకు రాజ్‌నాథ్ కూడా వెళ్లకపోవచ్చు..!
Pahalgam Attack | సూసైడ్ బాంబ్ ఇవ్వండి.. పాక్‌పై యుద్ధానికి వెళ్తా : కర్ణాటక మంత్రి
Kedarnath | కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. తొలిరోజు దర్శించుకున్న 30 వేల మంది భక్తులు