Russias Victory Day Parade | మే 9వ తేదీన జరిగే రష్యా విక్టరీ డే పరేడ్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా హాజరు కాకపోవచ్చని తెలిసింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ఈ ఈవెంట్‌కు ప్రధాని మోదీ (PM Modi) వెళ్లాల్సి ఉంది. అయితే, ఉగ్రదాడితో మాస్కో పర్యటనను ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈవెంట్‌కు ప్రధాని మోదీ రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. మోదీ పర్యటన రద్దుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ విక్టరీ డే వేడుకల్లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఆయన కూడా వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌ను పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ (Victory Day Parade) నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో ఈ నెల 9వ తేదీన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్రదేశాలకు ఆహ్వానం పంపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపింది. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మోదీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు.
Also Read..
Pahalgam Attack | సూసైడ్ బాంబ్ ఇవ్వండి.. పాక్‌పై యుద్ధానికి వెళ్తా : కర్ణాటక మంత్రి
Earthquake | గుజరాత్లో స్వల్ప భూకంపం
X Account Blocked | భారత్‌లో పాక్ సమాచార మంత్రి ఎక్స్ ఖాతా బ్లాక్