Earthquake | గుజరాత్ (Gujarat)లో భూకంపం (Earthquake) సంభవించింది. బనస్కాంత జిల్లాలోని వావ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 3:35 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.4గా నమోదైంది. భూమికి 4.9 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research) తెలిపింది. భూ ప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Also Read..
Kedarnath | కేదార్నాథ్కు పోటెత్తిన భక్తులు.. తొలిరోజు దర్శించుకున్న 30 వేల మంది భక్తులు
India Pakistan | ఆగని పాక్ కవ్వింపు కాల్పులు.. సమర్థంగా తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ
Stampede | ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 50 మందికి తీవ్రగాయాలు