తిరువనంతపురం: గోవాలో విషాదం చోటుచేసుకున్నది. శిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. లైరా దేవి ఆలయంలో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వైభవంగా జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన దవాఖానకు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
కాగా, తొక్కిసలాట జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు అధికసంఖ్యలో భక్తులు రావడంతోపాటు వారిని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.