Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడితో (Pahalgam Attack) పొరుగుదేశం పాకిస్థాన్‌పై భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ మంత్రి (Karnataka Minister) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆత్మాహుతికి బాంబు (Suicide Bomb) ఇస్తే పాక్‌పై పోరాటానికి తాను సిద్ధమేనని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కర్ణాటక గృహ నిర్మాణ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి బీజే జమీర్ అహ్మద్ ఖాన్ (BZ Zameer Ahmed Khan) మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు అనుమతిస్తే పాక్‌తో యుద్ధానికి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ‘మేం భారతీయులం, మేం హిందుస్థానీయులం. పాకిస్థాన్ మాతో ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోలేదు. పాక్ ఎప్పటికీ భారత్‌కు శత్రుదేశమే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. దాన్ని నా శరీరానికి అమర్చుకుని పాక్‌వెళ్లి వారిపై దాడి చేస్తాను’ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
“I will go to Pakistan for war.. Let Modi, Shah give me suicide bomb, I will tie to my body and go to Pakistan and attack them” – Karnataka Minister Zameer Ahmed Anna.. 💀💀💀💀💀😭😭pic.twitter.com/ULby9t7qz1
— Shilpa (@shilpa_cn) May 2, 2025
Also Read..
AIADMK | తమిళనాడు ఎన్నికలు.. అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి
Earthquake | గుజరాత్లో స్వల్ప భూకంపం
X Account Blocked | భారత్‌లో పాక్ సమాచార మంత్రి ఎక్స్ ఖాతా బ్లాక్