హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అహంకారం హద్దులు దాటిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా ప్రతిపాదిస్తూ ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రేవంత్ తీరు రాజకీయ అహంకారానికి, అవినీతి సంపాదనతో వచ్చిన మితిమీరిన గర్వానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ తనకు తానే దేశ ప్రధానమంత్రిని తయారు చేసే సత్తా ఉన్నదని ప్రకటించుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.