బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 15:22:56

హిరా సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

హిరా సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలను రేంజర్స్‌ లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) నుంచి బలమైన, సమర్థవంతమైన ప్రతీకారం తీర్చుకునేందుకు సత్పాల్‌, మన్యారి, కరోల్‌ కృష్ణ, గుర్నాం సరిహద్దు అవుట్‌ పోస్ట్‌ ప్రాంతాల్లో సరిహద్దు నుంచి కాల్పులు శనివారం రాత్రి 9గంటలకు ప్రారంభమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జాము వరకు ఇరుపక్షాల మధ్య సరిహద్దు కాల్పులు కొనసాగాయని, అయితే భారత్‌ వైపు ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (ఎల్‌ఓసీ) వెంట మెన్దార్‌ సెక్టార్‌లో డ్రోన్‌ కదలికలను గుర్తించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.