Pahalgam | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాం (Pahalgam)లో గల మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26 మంది బలయ్యారు. అయితే, ఈ దాడి తర్వాత జనం ఆ ప్లేస్‌కు వెళ్లేందుకు భయపడ్డారు. దీంతో పర్యాటకులు లేక వ్యాలీ మొత్తం ఇన్నిరోజులూ వెలవెలబోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
పెద్ద ఎత్తున టూరిస్ట్‌లు పహల్గాం బాట పట్టారు. ఆ ప్రాంతానికి పర్యాటకులు (Tourists) క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పహల్గాంలో మళ్లీ సందడి నెలకొన్నట్లు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్ పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడాన్ని చూసి చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ మేరకు అక్కడ టూరిస్ట్ వెహికల్స్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్న ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
The last time I was in Pahalgam I cycled through a market that was all but deserted. Today I came back to a Pahalgam that was bustling with activity. Tourists from various parts of the country competed for space with local picnickers who were enjoying the cool climate & rainy… pic.twitter.com/Mm9puLMOEG
— Omar Abdullah (@OmarAbdullah) June 22, 2025
Also Read..
Tej Pratap Yadav | నేను భయపడే రకం కాదు.. బహిష్కరణపై తేజ్ ప్రతాప్ యాదవ్
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం
Pahalgam | ఆ ఇద్దరినీ జమ్మూ కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ