Pahalgam : ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాం (Pahalgam) లో మారణహోమం సృష్టించిన నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు నిందితులు పర్వీజ్ అహ్మద్ జోతర్ (Parvaiz Ahmad Jothar), బషీర్ అహ్మద్ జోతర్ (Bashir Ahmad Jothar) లను ఎన్ఐఏ అధికారులు ఇవాళ జమ్ము కోర్టు (Jammu Court) లో హాజరుపర్చారు. నిందితులు ఇద్దరికీ రిమాండ్ విధించాలని ఎన్ఐఏ అధికారులు కోర్టును కోరనున్నారు.
పహల్గాం ఉగ్రదాడి కేసు విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు మొత్తం 2 వేల మందికిపైగా సాక్ష్యులను విచారించారు. గడిచిన రెండు వారాల్లో ఏకంగా 32 లొకేషన్లలో సోదాలు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారని గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. ఇవాళ వాళ్లను కోర్టులో హాజరుపర్చారు.
#WATCH | Jammu | Parvaiz Ahmad Jothar and Bashir Ahmad Jothar, arrested in connection with the Pahalgam terror attack, brought to Jammu court
NIA have arrested the two men for harbouring terrorists involved in the Pahalgam terror attack. pic.twitter.com/tWI5BpBjGT
— ANI (@ANI) June 23, 2025