హైదరాబాద్: ఓ మహిళ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వంట చేస్తుండగా స్టవ్ కు ఉన్న గ్యాస్ పైప్ (Gas Leak) ఒక్కసారిగా ఊడిపోయింది. అదేసమయంలో కిచెన్లో ఉన్న మహిళ తెలివిగా వ్యవహరించారు. సిలిండర్ను వంట గది నుంచి హాల్కి తీసుకొచ్చారు. కిచెన్తోపాటు, హాల్ తలపులు, కిటికీలు తెరిచి ఉంచటంతో గ్యాస్ మొత్తం బయటకు వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళతోపాటు మరో వ్యక్తి సిలిండర్ను పైకి లేపడానికి ప్రయత్నించారు. ఇంతలో కిచెన్లో ఒకసారిగా మంట చెలరేగడంతో పేలుడు సంభవించింది.
అయితే సిలిండర్ను ఇరుకుగా ఉన్న కిచెన్ నుంచి బయటకు తీసుకొచ్చి హాల్లో వేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. గ్యాస్ బండలో కొద్దిమొత్తంలో ఉన్న ఎల్పీజీ బయటకు వెళ్లే వరకు ఆ పైపు ముఖద్వారం వద్ద మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇదంతా హాల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ నెల 18న మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతున్నది.
They were lucky that all the doors and windows were open, which allowed much of the gas to escape outside and significantly reduced the impact of the explosion. pic.twitter.com/HhS9TTz6m8
— Satyam Raj (@Satyamraj_in) June 22, 2025
They were fortunate that all doors and windows were open, allowing much of the gas to escape outdoors, significantly reducing the explosion’s impact.
pic.twitter.com/fFnDIlHk5F— Ghar Ke Kalesh (@gharkekalesh) June 22, 2025