Lalu Yadav : బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ (RJD party) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav).. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. ఆయన ఇప్పటివరకు 12 పర్యాయాలు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు 13వ సారి పార్టీ అధ్యక్షుడు కాబోతున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. లాలూజీ మరోసారి పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడంతో పార్టీలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరిలో సంతోషం వెల్లివిరిసిందని తేజస్వి అన్నారు. లాలూ నేతృత్వంలో బీహార్లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాబోతోందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.