Yadav community : తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ గొర్రెలు, మేకలకు వైద్య సదుపాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరారు.
మొత్తం 30 గొర్రెలు, ఐదు మేకలతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు గాంధీభవన్‌కు చేరుకున్నారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలని, గొర్రెలకు, మేకలకు వైద్య, బీమా సౌకర్యాలు కల్పించాలి అంటూ నినాదాలు చేశారు.
#WATCH | Telangana | Members of the Yadav community staged a protest with sheep and goats at the Telangana Congress headquarters at Gandhi Bhavan in Hyderabad, demanding a ministerial berth for their community.
The protesters say, “Today, we staged a protest at the Telangana… pic.twitter.com/huWFPXy2u0
— ANI (@ANI) June 23, 2025