Iran-Israel | ఇజ్రాయెల్-ఇరాన్ (Iran-Israel) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా సైతం యుద్ధరంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. . ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. ఇక ఇరాన్‌పై అమెరికా దాడుల అనంతరం పెద్ద ఎత్తున ఆందోలనలు వ్యక్తమవుతున్నాయి.
Protesters MARCH in Times Square carrying anti-war signs and CHANTING:
‘No US war crimes’
Think they have a point? pic.twitter.com/ZtxzbJyxAU
— RT (@RT_com) June 19, 2025
అమెరికాలోని ప్రధాన నగరాల్లో (US cities) ఇరాన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. ఇరాన్‌కు అనుకూలంగా ప్రదర్శన చేపట్టారు. ‘ఇరాన్‌పై దాడులు ఆపండి’, ‘ఇరాన్‌పై యుఎస్-ఇజ్రాయెల్ యుద్దం వద్దు’ అనే నినాదాలతో పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ మేరకు యుద్ధ వ్యతిరేక నినాదాలు (anti-war protests) చేశారు. అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, చికాగో, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో వందలాది మంది నిరసన కారులు యుద్దానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ వెలుపల, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శనకారులు గుమిగూడారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడం మానుకోవాలని, ఇరాన్‌తో సంఘర్షణలో జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేశారు.
Anti-war protests were happening across the Bay Area and the nation in response to the Trump administration’s strikes on Iranian nuclear facilities. Hundreds of protesters were on the move up Market Street in San Francisco on June 22. More here: https://t.co/t1jZNphdTV pic.twitter.com/SA0yarlh1q
— ABC7 News (@abc7newsbayarea) June 23, 2025
అమెరికా భీకర దాడి..
అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ ‘మిడ్నైట్ హ్యామర్’ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు, ఏడు బీ-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించిన స్టెల్త్ బాంబర్లు రెండు అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను జారవిడువగా, మరో అణు కేంద్రంపై క్షిపణులతో దాడికి పాల్పడింది. బంకర్ బస్టర్ బాంబులు భూగర్భంలోని బంకర్లలోకి చొచ్చుకుపోయి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి.
అమెరికానగరాల్లో హై అలర్ట్
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగా ముఖ్యమైన అన్ని కేంద్రాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నట్టు న్యూయార్క్ పోలీస్ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read..
Benjamin Netanyahu | లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని