Iran-Israel | అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్ (Iran-Israel conflict)కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్‌పై అమెరికా దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌పై దాడితో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధానికి తెరలేపారని ఆరోపించారు. శాంతి స్థాపకుడిగా వచ్చిన ట్రంప్.. అమెరికా కోసం కొత్త యుద్ధాన్ని ప్రారంభించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను సాధించలేదని పేర్కొన్నారు. ‘ఇరాన్ అణుకేంద్రాలపై జరిపిన దాడులతో అమెరికా పెద్దగా సాధించిందేమీ లేదు. అణుకేంద్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ దాడుల ద్వారా మధ్యప్రాచ్యంలో మరో కొత్త యుద్ధానికి అమెరికా తెరలేపింది’ అని ఆయన మండిపడ్డారు. ఈ యుద్ధంలో ఇరాన్‌కు చాలా దేశాలు తమ సొంత అణ్వాయుధాలను (Nuclear Warheads) నేరుగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Also Read..
Benjamin Netanyahu | లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు : ఇజ్రాయెల్ ప్రధాని
Iran Nuclear Site | అమెరికా దాడిలో దెబ్బతిన్న ఫోర్డో అణుకర్మాగారం.. ఉపగ్రహ చిత్రాలు