Ayatollah Ali Khamenei | ఇరాన్ (Iran) అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అమెరికా, ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమపై దాడి చేసిన వారికి కఠినమైన, నిర్ణయాత్మకమైన శిక్ష ఉంటుందని హెచ్చరించారు. అమెరికా దాడుల తర్వాత ఖమేనీ తొలిసారి స్పందించారు. శత్రువులు కఠినమైన శిక్షణు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘దాడులు కొనసాగుతాయి. శత్రువు భారీ తప్పు చేసింది. పెద్ద నేరానికి పాల్పడింది. శిక్షించాల్సిందే. ఇప్పటికే శిక్ష మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు కఠినమైన, నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుంది’ అని ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు.
#همین_حالا
مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ
— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025
అత్యంత సురక్షిత బంకర్లోకి ఖమేనీ
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులతో విరుచుకుపడిన వేళ ఇరాన్ చీఫ్ ఖమేనీ ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అందరిలో తలెత్తుతున్నది. అయితే ఆయన అత్యంత సురక్షితమైన ఒక అండర్‌గ్రౌండ్ బంకర్లో ఉన్నారని, ఆయనపై దాడి జరిగేందుకు అవకాశాలున్నందున ఆయన ఉంటున్న ప్రాంతం ఎలాంటి సిగ్నళ్లకు అందకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా నిలిపివేశారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తు లు కొందరు ఆయనకు ఎప్పటికప్పుడు యుద్ధ సమాచారాన్ని అందజేస్తున్నారు.
Also Read..
Iran Nuclear Site | అమెరికా దాడిలో దెబ్బతిన్న ఫోర్డో అణుకర్మాగారం.. ఉపగ్రహ చిత్రాలు
Donald Trump | బీ-2 బాంబర్లు మిస్సోరిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి : ట్రంప్