Donald Trump | ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధంలో తాజాగా అమెరికా కూడా చేరింది. ఆదివారం టెహ్రాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై కచ్చితమైన బాంబు దాడులతో విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్‌లోని అణు కేంద్రాలపై జరిపిన ఈ దాడుల కోసం అమెరికా తమ అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది. వాటిలో బీ-2 బాంబర్లు (B-2 bombers), భయంకరమైన జీబీయూ-57 బంకర్ బస్టర్లు, తొమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. బీ-2 పైలట్ల సాహసాన్ని ప్రసంశించారు. పైలట్లు తమ పని ముగించుకొని సురక్షితంగా మిస్సోరి (Missouri)లో ల్యాండ్ అయినట్లు వెల్లడించారు. ‘గ్రేట్ బీ-2 పైలట్లు ఇప్పుడే మిస్సోరీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వారు చేసిన పనికి ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.
మరోవైపు ఇరానియన్ అణుకేంద్రాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్‌లపై బాంబు దాడుల తర్వాత మిస్సోరీలోని వైట్ మ్యాన్ వైమానిక దళ స్థావరానికి బీ-2 బాంబర్లు తిరిగి వస్తున్న వీడియోని వైట్‌హౌస్ సోమవారం విడుదల చేసింది. ‘ఇరాన్‌పై దాడి తర్వాత మిస్సోరిలోని వైట్‌మ్యాన్ వైమానిక దళ స్థావరం వద్ద బీ-2 బాంబర్లు సురక్షింతగా దిగాయి’ అని శ్వేతసౌధం పేర్కొంది. ఈ మేరకు బీ-2 బాంబర్లు మిస్సోరి చేసుకున్న వీడియోని పంచుకుంది.
God bless the United States Military — the greatest force for freedom the world has ever known. 🇺🇸🦅 pic.twitter.com/n5zjcsu3o4
— The White House (@WhiteHouse) June 22, 2025
బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు
అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, వ్యూహాత్మక ఆయుధాల్లో ఒకటైన బీ-2 బాంబర్లు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఏమార్చి కచ్చితమైన దాడుల (ప్రెసిషన్ అటాక్స్)తో విరుచుకుపడగలవు. 40 వేల పౌండ్ల (18 వేల కిలోల) మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలిగే ఈ ‘రాకాసి’ యుద్ధ విమానాలు అత్యంత రక్షణ కలిగిన లక్ష్యాలను సైతం నాశనం చేయగలవు. స్టెల్త్ ఫీచర్లను కలిగి ఉండే ఈ బాంబర్లను గుర్తించడం, ట్రాక్ చేయడం, ప్రతిఘటించడం చాలా కష్టం. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న సైనిక విమానాల్లో ఇదే అత్యంత ఖరీదైనది. ఒక్కో బీ-2 బాంబర్ ఖరీదు దాదాపు 210 కోట్ల డాలర్లు (రూ.18,182 కోట్లు). నార్త్రోప్ గ్రమ్మన్ కంపెనీ తయారు చేసిన ఈ భారీ, లాంగ్-రేంజ్ బాంబర్ మార్గం మధ్యలో ఇంధనాన్ని నింపుకోకుండా ఏకబిగిన దాదాపు 7 వేల మైళ్లు (11 వేల కిలోమీటర్లు), ఒకసారి రీఫ్యూయలింగ్‌తో 11,500 మైళ్లు (18,500 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కేవలం గంటల వ్యవధిలోనే చేరుకోగలదు.
Also Read..
Iran VS Israel | ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’.. 125 యుద్ధవిమానాలతో మెరుపుదాడి చేశామిలా..!
అమెరికా భీకర దాడి.. మూడు అణుకేంద్రాలపై విరుచుకుపడిన అగ్రరాజ్యం