Iran VS Israel : పశ్చిమాసియాలోని ఇరాన్‌ను హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా యుద్ధరంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయేల్‌కు మద్దతుగా నిలుస్తూ.. ఇరాన్‌పై శనివారం అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ (Operation Midnight Hammer) కోడ్ పేరుతో జరిగిన ఈ దాడులతో ఇరాన్ ఉలిక్కిపడింది. ఈ కోడ్ ఆపరేషన్ వివరాలను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టేట్ జనరల్ చైర్మన్ డాన్ కైన్ (Dan Caine) ఆదివారం శ్వేత సౌధంలో వెల్లడించారు. ఇరాన్‌పై 125 యుద్ధ విమానాలతో 25 నిమిషాల్లో మెరుపుదాడి చేశామని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా సాగినట్టు కైన్ తెలిపారు.
‘శుక్రవారం అర్ధ రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ ఇరాన్‌పై దాడులు చేశాం. 125 యుద్ధ విమానాలతో 25 నిమిషాల పాటు మెరుపు దాడి కొనసాగించాం. అణు స్థావరాలైన ఫొర్డో, నతంజులపై 13 వేల కిలోలకు పైగా భారీగా పేలుడు పదార్థాలతో విరుచుకుపడ్డాం. ఇసాఫహన్ అణు కేంద్రంపై తొమహక్ క్షిపణులను ప్రయోగించాం. వీటిలో ఏడు బీ-2 స్పిరిట్ బాంబర్స్ది కీలక పాత్ర. ఇరాన్‌లోని బంకర్లను ధ్వంసం చేయడం కోసం 14 బంకర్ బస్టర్ బాంబ్స్ ఉపయోగించాం.
🛑 LIVE: US Defense Secretary Pete Hegseth confirmed that Operation Midnight Hammer has “obliterated” Iran’s nuclear ambitions.
The operation used 14 Massive Ordnance Penetrators (MOPs) to strike key nuclear sites.
Hegseth stated the operation did not target Iranian troops or… pic.twitter.com/fPYdWoYH1c
— BrashNews™ (@brashnews) June 22, 2025
యుద్ధ వ్యూహంలో భాగంగా ఇరాన్ సైన్యం దృష్టి మరల్చడం కోసం కొన్ని విమానాలను పశ్చిమ ప్రాంతం, పసిఫిక్ మహాసముద్రం మీదుగా నడిపాం’ అని కైన్ వివరించారు. అమెరికా ఎంట్రీతో ఇజ్రాయేల్ బలం పెరగినా.. ఇరాన్ మాత్రం తగ్గేదేలో అంటోంది. అమెరికా మొదలు పెట్టింది.. మేము ముగిస్తాం అంటూ ఆ దేశ నాయకులు అంటున్నారు.