Iran Nuclear Site | ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధంలో తాజాగా అమెరికా కూడా చేరింది. ఆదివారం టెహ్రాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై కచ్చితమైన బాంబు దాడులతో విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్‌లోని అణు కేంద్రాలపై (Iran Nuclear Sites)జరిపిన ఈ దాడుల కోసం అమెరికా తమ అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది. వాటిలో బీ-2 బాంబర్లు (B-2 bombers), భయంకరమైన జీబీయూ-57 బంకర్ బస్టర్లు, తొమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. అమెరికా జరిపిన ఈ దాడిలో ఫోర్డో అణు కర్మాగారం (Fordow nuclear plant) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.
ఈ మేరకు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అక్కడ ‘అసాధారణ కార్యాచరణ’ జరిగినట్లు ఈ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా దాడికి ముందు, దాడి తర్వాత అక్కడ పరిస్థితిని ఈ ఉప్రగహ చిత్రాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. పేలుళ్ల ధాటికి పర్వత భాగం రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు వాటి ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించాయి. అమెరికా ఎమ్ఓపీలతో (Massive Ordnance Penetrator bunker-busting bombs) దాడి చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి నాయకత్వం వహిస్తున్న మాజీ యూఎన్ మాజీ అణు తనిఖీదారు డేవిడ్ ఆల్బ్రైట్ తెలిపారు. అయితే అగ్రరాజ్యం దాడికి ముందే ఇరాన్ కీలక పరికరాలతో పాటు శుద్ధి చేసిన యురేనియంను తరలించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read..
Hormuz Strait | హర్మూజ్ జలసంధి మూసివేత..! ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం తప్పదు..!
Donald Trump | బీ-2 బాంబర్లు మిస్సోరిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి : ట్రంప్
Suicide Bombing | చర్చిలో ఆత్మాహుతి దాడి.. 22 మంది మృతి