భువనేశ్వర్: ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ప్రయాణికుల క్షేమం గురించి అతడు ఆలోచించాడు. బస్సును రోడ్డు పక్కన ఆపాడు. స్టీరింగ్‌పై కుప్పకూలి మరణించాడు. (RTC Driver Suffers Heart Attack) దీంతో ఆ బస్సులోని ప్రయాణికులకు ముప్పుతప్పింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 44 ఏళ్ల పీ సాయి కృష్ణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సుమారు 30 మంది ప్రయాణికులతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరికి బస్సును నడిపాడు.
కాగా, మార్గమధ్యలో కోరాపుట్-సునాబెడ రహదారిలోని డుమురిపుట్ సమీపంలో డ్రైవర్ సాయి కృష్ణకు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ బస్సులోని ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించాడు. బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపాడు. స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు.
మరోవైపు సహ డ్రైవర్ ఆ బస్సును నడిపాడు. కోరాపుట్ చేరుకున్న తర్వాత ఎస్ఎల్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి డ్రైవర్ కృష్ణను తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఆ తర్వాత సహ డ్రైవర్ సహాయంతో బస్సులోని ప్రయాణికులను మల్కన్‌గిరి చేర్చినట్లు ఒడిశా ఆర్టీసీ అధికారులు తెలిపారు. గుండెపోటుతో మరణించిన డ్రైవర్ సాయి కృష్ణ సమయస్ఫూర్తి వల్ల ప్రయాణికులంతా సురక్షితమని వెల్లడించారు.
Also Read:
Nitish Kumar’s son Nishant | సీఎం నితీశ్ ప్రమాణ స్వీకారంలో.. ఆకట్టుకున్న కుమారుడు నిశాంత్
2 brides in a month | ఒకే నెలలో ఇద్దరు మహిళలను పెళ్లాడిన వ్యక్తి.. అరెస్ట్ చేయించిన భార్యలు
Watch: పెళ్లిలో వ్యక్తి చెంపపై కొట్టిన డ్యాన్సర్.. తర్వాత ఏం జరిగిందంటే?