హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : కనీసం తట్టెడు మట్టి కూడా తీయకముందే కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అంచనాలు మాత్రం రెండేండ్లలో రెండింతలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,900 కోట్ల నుంచి ఏకంగా రూ.4,700 కోట్లకు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం తీరిది. అంతేగాక అదనంగా రూ.1,000కోట్లతో మరో ప్యాకేజీని చేర్చేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రాజెక్టు పనులు మొదలయ్యాక అంచనాలు ఇంకెంత పెంచుతారో అని చూడాల్సి ఉన్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లా తాగునీటి అవసరా ల కోసం తొలుత నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(ఎన్‌కేఎల్‌ఐఎస్) చేపట్టాలని రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం రెండు ప్యాకేజీలుగా పనులు చేయాలని నిర్ణయించింది. ప్యాకేజీ-1లో పంచ్దేవ్పహాడ్ పంపింగ్ స్టేషన్, భూత్పూర్ పంపింగ్ స్టేషన్లతోపాటు ఊ ట్కూరు, జయమ్మ, కానుకుర్తితో పాటు పలు చెరువుల అభివృద్ధి చేయనున్నారు. ఇక ప్యాకేజీ-2లో ఊట్కూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఇవేగా క జాజాపూర్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ కలిపి మొత్తం 7 చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదట 2,900 కోట్ల అంచనాతో ప్రాజెక్టును రూపొందించిన రేవంత్ సర్కార్.. ప్యాకేజీ-1 పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కు, ప్యాకేజీ పనులను మేఘా ఇం జినీరింగ్ కంపెనీకి కట్టబెట్టింది.
తాజాగా ఈ వ్యయాన్ని ఏకంగా రూ.4,700కోట్లకు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి తోడు లిఫ్ట్ స్కీమ్‌లో మక్తల్ ప్యాకేజీ ని అదనంగా చేర్చాలని నిర్ణయించారు. అందుకు అదనంగా మరో రూ.1,000 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉండగా అవి కూడా కలిపితే ప్రాజె క్టు అంచనా వ్యయం ఏకంగా రూ.5,700 కోట్లకుపైగానే చేరనున్నది. లిఫ్ట్ స్కీమ్ కోసం 3వేల ఎకరాలు భూసేకరణ అ వసరంగా కాగా, అదనంగా రూ.1,404. 50 కోట్లు వ్యయమవుతుందని ఇరిగేషన్ శాఖ రెండేండ్ల క్రితమే అంచనా వేసింది. స్కీమ్‌కు 2024 ఫిబ్రవరిలోనే ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చే సింది. పంప్‌హౌస్‌ల కోసం 540 ఎకరా లు, ప్రెషర్ మెయిన్స్ తదితర వాటికి 8 ఎకరాలు అవసరం కాగా భూసేకరణ పూర్తి చేయలేదు. పంప్‌హౌస్‌ల వరకే భూసేకరణ చేపట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రెండింతలయ్యింది. భూసేకరణ అంచనాలనే రూ.2 వేల కోట్లకు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. రూ.2,900 కోట్ల అంచనాలు రెండేండ్ల నాటివేనని, పనులను ప్రారంభించేనాటికి అంచనాలు మళ్లీ పెరుగుతాయని ఇంజినీర్లు చెప్పడం గమనార్హం.