కనీసం తట్టెడు మట్టి కూడా తీయకముందే కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అంచనాలు మాత్రం రెండేండ్లలో రెండింతలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,900 కోట్ల నుంచి ఏకంగా రూ.4,700 కోట్లకు పెంచింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్కేఎల్ఐఎస్) పనుల టెండర్లపై ఇరిగేషన్ శాఖ ఆది నుంచీ గోప్యతను పాటిస్తున్నది.