ఊటూర్, జూన్ 23 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ భూసేకరణ సర్వేను అధికారులు పోలీస్ పహారా మధ్య నిర్వహిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఊటూర్ మండలం దంతన్‌పల్లి శివారులో సోమవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పెద్ద చెరువు సాగునీటి సామర్థ్యం పెంచేందుకు సర్వే కొనసాగించారు.
సుమారు 96 ఎకరాల భూమి కోసం తహసీల్దార్ రవి ఆధ్వర్యంలో ఆర్ఐ కృష్ణారెడ్డి, వెంకటేశ్, అధికారులు సర్వే పూర్తిచేశారు. కాగా ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు పరిహారం అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.