అసన్ (కొరియా) : భారత యువ షట్లర్ తన్వి శర్మ కొరియా మాస్టర్స్ టోర్నీని విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో తన్వి.. 21-16, 21-15తో యువాన్ అన్ కి (చైనా)ని ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది.
మరో మ్యాచ్‌లో హైదరాబాదీ వలిశెట్టి శ్రీయాన్షి 21-15, 21-14తో పై యు-పొ (తైవాన్)ను చిత్తుచేసింది. అష్మిత , ఇషారాణి, రక్షిత, మాన్సి కూడా ముందంజ వేయగా.. పురుషుల సింగిల్స్లోకిదాంబి శ్రీకాంత్‌తో పాటు కిరణ్ జార్జ్జ్, రోహిత్ చౌహాన్, తరుణ్ మన్నెపల్లి ఫస్ట్ రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.