హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని ప్రకటించిన హెల్త్‌కార్డుల విషయం ‘ఆదిలోనే హంసపాదు’ అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తామన్న హెల్త్‌కార్డులు సగం మందికే అందనున్నాయి. కొన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కు హెల్త్‌కార్డులు అందని ద్రాక్షగానే మిగిలా యి. రాష్ట్రంలోని రెండు లక్షల ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందే పరిస్థితి కనిపించడం లేదు. హెల్త్కార్డులిచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆదివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, 010 పద్దు ద్వారా వేతనాలు పొందే వారికే ఈ కార్డులిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 6.44 లక్షల మందికి మాత్రమే ఈ కార్డులు అందనున్నాయి. గ్రంథాలయ ఉద్యోగులు, గురుకుల, ఎయిడెడ్, మాడల్, కేజీబీవీ టీచర్లు హెల్త్‌కార్డులను పొందలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ ఉ ద్యోగుల సంఖ్య ఎంత? పెన్షనర్లు ఎంతమంది? అన్న అనుమానాలొస్తున్నాయి. సర్కార్ వెల్లడించిన సంఖ్య, వివరాలు సైతం గందరగోళంగా ఉన్నాయి. పెన్షనర్ల సంఖ్యలో 50 వేలు, ఉద్యోగుల సంఖ్యలో 1.63 లక్షలు తేడా కనిపిస్తున్నది.
వీరికి కార్డులు లేనట్టే..
ఉద్యోగుల జేఏసీలోనూ భిన్నాభిప్రాయాలు
టీజీవో, టీఎన్జీవో సంఘాలు ఈ స్కీమ్‌ను స్వాగతించగా.. కొన్ని సంఘాలు మార్పులు చేయాలని కోరాయి. ఇష్టం లేనివారికి ఆప్షన్ ఇవ్వాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. 1.5% కాంట్రిబ్యూషన్ ఎక్కువని, దీనిని వెయ్యి రూపాయలకు పరిమితం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని కోరారు.
మాడల్ టీచర్లకు మొండిచెయ్యేనా.. ?
మాడల్ స్కూల్ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వకపోవడం శోచనీయం. హెల్త్‌కార్డుల విషయంలో మమల్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో టీచర్లంతా మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వంలోనే పనిచేస్తున్నా మాపై వివక్ష అత్యంత దారుణం. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని తక్షణమే హెల్త్స్కీమ్ను మాడల్ స్కూల్ టీచర్లు, ఉద్యోగులకు వర్తింపజేయాలి.
– తరాల జగదీశ్, పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సమస్యలు పరిష్కరించండి
లేకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం ఉద్యోగ సంఘాల జేఏసీ
ఉద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అభిప్రాయపడింది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. నాంపల్లిలోని టీన్జీవోభవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ నేతలు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం..
హెల్త్ కార్డుల ప్రకటనతో ఉద్యోగులకు భరోసా లభించిందని సెక్రటేరియట్ ఉద్యోగుల అసోసియేషన్ అభిప్రాయపడింది.