Cold Waves | గజగజ వణుకుతున్న ఉత్తరభారతం.. చలిమంటలతో ఉపశమనం పొందుతున్న ప్రజలు
Cold Waves | ఉత్తరభారతాన్ని (North India) చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి.
Cold Waves | ఉత్తరభారతాన్ని (North India) చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
#WATCH | Cold wave and fog conditions continue to prevail in Chandigarh pic.twitter.com/ZKoF5eaoiE
— ANI (@ANI) January 9, 2024
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికితోడు ఆయా రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పగలు కూడా రాత్రి వాతావరణాన్ని తలపిస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత 50 మీటర్లుగా ఉంది. రాజస్థాన్, బీహార్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో విజిబిలిటీ 50 నుంచి 200 మీటర్లుగా ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
#WATCH | Madhya Pradesh: Cold and dense fog engulfs Bhopal. pic.twitter.com/GC63ELWZol
— ANI (@ANI) January 9, 2024
ఇక దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. సఫ్ధార్‌జంగ్ అబ్జర్వేటరీలో 6.9 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్డులో 6.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
#WATCH | Delhi: A thin layer of fog grips the city as cold wave continues.
(Drone visuals from Bhikaiji Cama Place shot at 7:50 am) pic.twitter.com/nNCjENcSut
— ANI (@ANI) January 9, 2024
#WATCH | Uttar Pradesh | Low visibility on roads in Mathura city due to dense fog during cold weather
(Visuals shot at 6:00 AM) pic.twitter.com/v17sHK635M
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 9, 2024
Also Read..
IndiGo | ప్రయాణికులకు షాకిచ్చిన దేశీయ విమానయాన దిగ్గజం.. సీట్ల ఎంపిక ఛార్జీలు భారీగా పెంపు
Air India Express | భువనేశ్వర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Gulmarg: మంచులేని కశ్మీర్.. వెలవెలబోతున్న గుల్మార్గ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

