Air India Express | సాంకేతిక సమస్య కారణంగా (technical snag) ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ( Kolkata airport) అత్యవసరంగా ల్యాండ్ (emergency landing) అయ్యింది. కోల్‌కతా-భువనేశ్వర్- బెంగళూరు విమానం సోమవారం సాయంత్రం 5:10 గంటలకు కోల్‌కతా నుంచి బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన అరగంట తర్వాత అంటే 5:40 గంటలకు విమానం గాల్లో ఉండగా ఏదో పగిలిన శబ్ధం వచ్చినట్లు ప్రయాణికులు పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన పైలట్ ముందుజాగ్రత్తగా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ కంట్రోల్ అధికారులను కోరారు. వారి అనుమతితో విమానాన్ని కోల్‌కతాకు తిరిగి మళ్లించారు. సాయంత్రం 6 గంటల సమయంలో విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎయిర్‌లైన్స్‌కు చెందిన అధికారులు, సిబ్బంది విమానంలో సాంకేతిక లోపానికి గల కారణాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానం కోల్‌కతా ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Also Read..
Praveen Kumar | ఆర్సీబీకి ఆడాలని బెదిరించాడు.. ఐపీఎల్ ఫౌండర్‌పై మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
Gulmarg: మంచులేని కశ్మీర్.. వెలవెలబోతున్న గుల్మార్గ్
Tomato | టమాటా ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?