Tomato | టమాటా అంటే అందరికీ ఇష్టమే. సూప్ నుంచి చారు వరకు ఏదైనా చేసుకోవచ్చు. చవకగా దొరికేస్తుంది కూడా. కానీ, అతి సర్వత్ర వర్జయేత్ అనే మాట టమాటాకూ వర్తిస్తుంది.
అజీర్ణం: వీటిలోని సల్మోనిలా అనే రసాయనం వల్ల కడుపు ఉబ్బరంగా తోచవచ్చు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి ఆ సమస్య అధికం కావచ్చు.
ఎసిడిటీ: టమాటాల్ని మరీ ఎక్కువగా తింటే, ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా తేన్పులు, ఛాతీలో నొప్పి ఇబ్బంది పెడతాయి.
కిడ్నీలో రాళ్లు: పొటాషియం, ఆక్సలేట్ ఈ రెండు పదార్థాలూ కిడ్నీలో రాళ్లను పెంచవచ్చు. టమాటాలో ఈ రెండూ ఎక్కువే.
రక్తపోటు: టమాటాలో సోడియం తక్కువే. కానీ వీటిని సూప్‌గా తీసుకుంటే మాత్రం… అధిక మొత్తంలో సోడియం చేరి రక్తపోటును పెంచేస్తుంది.
నొప్పులు: టమాటాలో హిస్టమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం చూపించి, ఆర్థరైటిస్ లాంటి సమస్యల్ని తీవ్రతరం చేస్తుంది.
తలనొప్పి: తరచూ మైగ్రెయిన్ బారిన పడేవారు, టమాటాకు దూరంగా ఉండాలని ఓ పరిశోధన హెచ్చరిస్తున్నది.