Cold Wave | ఉత్తరాదిపై చలి పంజా.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
Cold Wave | దేశంలో చలితీవ్రత (Cold Wave) పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై (North India) చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.
Cold Wave | దేశంలో చలితీవ్రత (Cold Wave) పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై (North India) చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఇవాళ ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు (Dense fog) కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Delhi: Drone visuals from AIIMS area as fog grips the national capital amidst cold waves.
(Visuals shot at 7:30 am) pic.twitter.com/B6u1q3wbNk
— ANI (@ANI) January 5, 2024
గడ్డకట్టిన దాల్ సరస్సు..
భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు లోపలిభాగంలోని నీరు గడ్డకడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
#WATCH | J&K: A thin sheet of ice forms on the upper layer of Dal Lake in Srinagar as temperature dips further. pic.twitter.com/8zfZXC5Xe2
— ANI (@ANI) January 5, 2024
Also Read..
Chiranjeevi | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
Japan | జపాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 92కు చేరిన భూకంప మృతులు
Disha Patani | ప్రభాస్ కల్కి 2898 ఏడీలో దిశా పటానీ రోల్ ఇదేనట.. అభిమానులకు పండగే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

