Ram Mohan Naidu | గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Air India plane crash) ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి (Civil Aviation minister) కింజరపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని.. దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పడం సరికాదన్నారు.
రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపట్టాం. అంతర్జాతీయ ప్రొటోకాల్ ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక వచ్చింది. తుది నివేదికలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. బ్లాక్‌బాక్స్ దెబ్బతిన్నా డేటాను రిట్రీవ్ చేశాం. బ్లాక్‌బాక్స్‌ను తొలిసారి డీకోడ్ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు చేపట్టాం. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 90 శాతం వరకు పోస్టులు భర్తీ జరిగేలా చేస్తాం’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Also Read..
Lok Sabha | పహల్గాం ఉగ్రదాడిపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ వాయిదా
Heavy Rain | ముంబైని ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన సబ్‌వేలు.. ఐఎండీ హెచ్చరికలు