Lok Sabha | పహల్గాం ఉగ్రదాడిపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్సభ వాయిదా
Lok Sabha | పహల్గాం ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon Session)ను కుదిపేస్తోంది.
Lok Sabha | పహల్గాం ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon Session)ను కుదిపేస్తోంది. ఈ ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు (Opposition MPs) లోక్సభలో నిరసనకు దిగారు. దీంతో దిగువ సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో లోక్సభ (Lok Sabha)ను వాయిదా వేయాల్సి వచ్చింది.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశామయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమయ్యాయి. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Debate), ఆపరేషన్ సిందూర్పై చర్చించాలంటూ పట్టుబట్టారు. అయితే, ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చ చేపడదామని స్పీకర్ ఓంబిర్లా నచ్చజెప్పారు. అయినా ఎంపీలు వినిపించుకోలేదు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల నిరసనల మధ్యే లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
#WATCH | Lok Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs
Speaker Om Birla says, “The government wants to answer on every issue. The House should function. You have not come here to raise slogans. The House functions as per the rules and regulations. All the… pic.twitter.com/fxmj8o5iXx
— ANI (@ANI) July 21, 2025
Also Read..
PM Modi | ఆపరేషన్ సిందూర్ విజయంతో ప్రపంచం దృష్టి మొత్తం మేడిన్ ఇండియా ఆయుధాలపైనే : ప్రధాని మోదీ
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. విపక్షాల వాయిదా తీర్మానాలు
Mumbai train blasts case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

