Mumbai train blasts case | ముంబై రైలు పేలుళ్ల ఘటన (Mumbai train blasts case)లో బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా ఉండటం గమనార్హం. శిక్ష పడిన ఈ 12 మందిపై అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2006 జులై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు సబర్బన్ రైళ్లలో (suburban railway network) వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో 190 మంది వరకూ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం 2015 అక్టోబర్లో 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా.. మరో ఏడుగురికి జీవతఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పు వెలువరించింది. అందులో ఒకరు 2021లో కరోనా కారణంగా నాగ్పూర్ జైల్లో మృతి చెందాడు.
Also Read..
Banakacherla | ‘బనకచర్ల’పై పొరుగు రాష్ట్రాలు గప్చుప్.. తెలంగాణను ఒప్పిస్తే ప్రాజెక్టుకు ఆమోదమే!
BC Reservations Bill | బీసీ బిల్లును తిరస్కరించిన కేంద్రం.. కాంగ్రెస్ వివరణలిచ్చినా మళ్లీ వెనక్కి!
Vishal | ఏంటి.. విశాల్ పెళ్లి మళ్లీ వాయిదానా.. ఈ సారి కారణం ఏంటో తెలుసా?