Banakacherla | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలం గాణ): పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు, పోలవరం ప్రాజెక్టు టీఏసీ అనుమతులకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయాన్ని కేంద్ర సంస్థలే ధ్రువపరుస్తున్నాయి. అయినప్ప టికీ బేసిన్లోని ఒడిశా, ఛత్తీస్గఢ్, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికీ నోరుమె దపడం లేదు. ప్రాజెక్టుపై అభిప్రాయం చెప్పకుండా మౌనం దాల్చాయి. గతంలో అనేక అంశాలపై వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయా రాష్ట్రాలు ఇప్పుడు గప్చుప్ ఉండటం ఆశ్చర్యాన్ని, అనుమానాలను రేకేత్తిస్తున్నది. మరోవైపు, బేసిన్ రాష్ట్రాల న్నింటినీ పక్కనపెట్టి కేంద్రం సైతం తెలం గాణ సర్కారుతో మాత్రమే సంప్రదింపు లకు తెరతీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చర్చలంటూ తహతహలాడుతు న్నారు. ఈ పరిణామాలపై రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణ ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బనకచర్లకు ఆమోదముద్ర వేసే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
24లోగా అభిప్రాయాలు తెలపకుంటే అంతే..!
ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్తార్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు) ను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించిన విషయం విదితమే. సదరు పీఎ ఫ్ర్పై అభిప్రాయాలు తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ తన పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్ డబ్ల్యూడీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా, గోదావరి రివర్ బోర్డులతోపాటు బేసిన్లోని తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పీఎ ఫ్ర్పై నిర్దేశిత 45 రోజుల్లోగా అంటే ఈ నెల 24లోగా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. ఆ గడువు తరువాత అభిప్రా యాలు తెలిపినా పరిగణనలోకి తీసుకోరని నీటిరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు కృష్ణా రివర్మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), బేసిన్లోని తెలంగాణ మినహా మరే రాష్ట్రం పీఎఫైర్పై అభిప్రాయాలను కేంద్రానికి నివేదించకపోవడం గమనార్హం.
తెలంగాణను ఒప్పిస్తే బనకచర్లకు ఆమోదమే!
ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పిస్తే బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించిన ట్టేనని నీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అనుమతిస్తే దానిని సాకుగా చూపి కేంద్ర సంస్థల నుంచి అనుమతులు పొందడం సులువే నని చెప్తున్నారు. కేంద్ర సంస్థలు సైతం అదే విషయాన్ని వెల్లడించాయని, బేసిన్ రాష్ట్రాల అనుమతి తప్పనిసరని సూచించాయనే అంశాన్ని గుర్తుచేస్తు న్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉన్నదని, కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలతోనే అవి మౌనం వహిస్తున్నాయని భావిస్తు న్నారు. మహారాష్ట్ర సైతం వైతరణి-దమనగంగ-గోదావరి లింక్ చేపట్టేందుకు యత్నిస్తున్నదని, కేంద్రం ఆ మేరకు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం స్పందించడం లేదని తెలుస్తున్నది. కేంద్రం, ఏపీ ప్రభుత్వం బేసిన్లోని అన్ని రాష్ట్రాలను వది లిపెట్టి తెలంగాణ సర్కారుతో మాత్రమే సంప్రదింపులకు తెరతీయడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. తెలంగాణ సర్కారును ఏవిధంగానైనా ఒప్పిస్తే చాలు ఆ తరువాత బనకచర్లకు ఆమోదం తీసుకోవడం నల్లేరుమీద నడ కనేనని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు.
ప్రాజెక్టుపై కేంద్ర సంస్థల వ్యతిరేకత
బనకచర్ల ప్రాజెక్టు పీఎస్ఆర్ను అధ్య యనం చేసిన కేంద్ర సంస్థలన్నీ వ్యతిరేకత వ్యక్తంచేయడం గమనార్హం. సీడబ్ల్యూసీ, ఎన్ డబ్ల్యూడీఏతోపాటు గోదావరి రివర్ బోర్డు, పీపీఏ కూడా లింక్ ప్రాజెక్టు సరికా దని తేల్చిచెప్పాయి. గోదావరిలో మిగులు జలాలే లేవని ఎన్ డబ్ల్యూడీఏ తేల్చిచె ప్పింది. బనకచర్ల ప్రాజెక్టును చేపడితే పోల వరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలన్నీ మారిపోతాయని, కాబట్టి అందుకు అన్ని రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని, ప్రాజె క్టుకు టీఏసీని మళ్లీ తీసుకోవాల్సి ఉంటుం దని సీడబ్ల్యూసీ, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు స్పష్టంచేశాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాతనే బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆలోచిం చగలమని పీపీఏ సైతం కేంద్రానికి తేల్చిచె ప్పింది. కేంద్ర సంస్థలన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకుపోవద్దనే కేంద్రానికి సూచించాయి. అంతేకాదు, బనకచర్ల ప్రాజె క్టుకు తొలిదశ పర్యావరణ అనుమతులకు సంబంధించిన టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫ రెన్స్) అనుమతులకు కేంద్ర అటవీ, పర్యా వరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 8వ రావ్యాలీ, హైడ్రోఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) సైతం తిరస్క రించింది. సీడబ్ల్యూసీని సంప్రదించి గోదా వరిలో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్య యనం చేయించాలని, అంతర్రాష్ట్ర సమస్య లను పరిష్కరించుకున్న తరువాతనే టీవో ఆర్ కోసం ప్రతిపాదనలను పంపించాలని ఈఏసీ తేల్చిచెప్పింది.
నాడు పోలవరంపై పోరాటం.. నేడు మౌనం..
బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బేసిన్లోని మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలన్నీ మౌనంగా ఉండటమే విస్మయం కలిగిస్తున్నది. గతంలో ట్రిబ్యునల్ ఆమో దించిన, జాతీయహోదా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుపైనే ఆయా రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. కోర్టును ఆశ్ర యించాయి. ఆ వివాదాలు కోర్టుల్లో కొనసా గుతూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని, పదేం డ్లుగా మొత్తుకుంటున్నా కేంద్రం, ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఒడిశా సర్కారు ఇప్పటికీ ఆక్షేపిస్తున్నది. గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును కూడా ఒడిశా సర్కారు తీవ్రంగా వ్యతిరేకిం చింది. మహానదితో అనుసంధానం ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుపై కోర్టును ఆశ్ర యించింది. అదేవిధంగా జీసీ లింక్లో లో తన వాటా జలాలను వినియోగించుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కారు నిర్మిం చిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నది. కానీ, ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలు ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టుపై పూర్తిగా మౌనం దాల్చాయి. అదీ గోదావరి ట్రిబ్యు నల్ అవార్డుకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టు అయినా అవి నోరుమెదపకపో వడం గమనార్హం.
రేవంత్ రెడ్డి తహతహ
బనకచర్ల ప్రాజెక్టు ట్రిబ్యునల్ అవా ర్డుకు విరుద్ధమని, తెలంగాణ నీటిహ క్కులకు గొడ్డలిపెట్టనే ఆందోళన వ్యక్త మవుతున్నా.. రేవంత్రెడ్డి సర్కారు మాత్రం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నా మని ఖరాకండిగా చెప్పకపోవడంపై నీటి రంగనిపుణులు, తెలంగాణవా దులు మండిపడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్ద్వంద్వంగా తోసిపుచ్చ కుండా అసంబద్ధ వాదనలకు దిగ డంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి పూటకోమాట చెప్పడం, ఏపీ, కేంద్రంతో చర్చలకు పరుగులు తీయడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సూత్రప్రాయంగా సీఎం రేవంత్రెడ్డి సైతం బనకచర్లకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమయ్యా రని నీటిరంగ నిపుణులు భావిస్తు న్నారు. నిలదీయాల్సిన చోట నీళ్లు నమలడమేమిటని ప్రశ్నిస్తున్నారు. నేరుగా అంగీకరించకుండా దొడ్డిదా రిన కమిటీ పేరిట బనకచర్ల ప్రాజెక్టు ఆమోదానికి రంగం సిద్ధంచేశారని విశ్లేషిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ చర్యలను మానుకోవాలని, బనక చర్లపై చర్చలనే ప్రసక్తే లేదని తేల్చిచె ప్పాలని నీటిరంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.