BC Reservations Bill | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంపిన బిల్లులను కేంద్రం తీర స్కరించినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లపై ఉన్న 50శాతం సీలింగ్ కొర్రీలతో బిల్లులను వెనక్కి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇంటింటి సర్వే గణాంకాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గత మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 2 బీసీ బిల్లు లను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించింది. బిల్ నంబర్- 3 ద్వారా విద్య, ఉపాధిరంగాల్లో, బిల్ నంబర్-4 ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచింది. అసెంబ్లీ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతికి ఆయా బిల్లులను పంపడంతో పాటు, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. తాజాగా ఆ బి ల్లులను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీల రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ట్రిపుల్ టెస్ట్ పేరిట మార్గదర్శకాలను జారీచేసింది. ప్రస్తు తం కేంద్రం కూడా అదే విషయాన్ని ఉటం కిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజుల క్రితమే బిల్లులను వెనక్కి పంపినట్టు సమాచారం. ఆర్టికల్ 15(4), 15 (5), 16(5), ఈడ బ్ల్యూఎస్ రిజర్వేషన్ల జడ్జిమెంట్‌ను ఉటం కిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. అయినా కేంద్రం మళ్లీ ఆ బిల్లులపై కొర్రీలు పెట్టి వెనక్కి పంపినట్టు సమాచారం. ఈ విష యలపై రాష్ట్ర ప్రభుత్వం గోప్యతను పాటిస్తూ, కేవలం కొంతమంది అధికారులతో సమాలో చనలను జరిపినట్టు తెలుస్తున్నది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కొర్రీల నేపథ్యంలోనే ఆర్డినె నున్ను తెరమీదకు తీసుకొచ్చినట్టు సమా చారం. బిల్లులను కేంద్రం వెనక్కి పంపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను బహి ర్గతం చేయకుండా గోప్యత పాటించడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. వివరణలు ఇచ్చినా తిరకాసు!
రాష్ట్ర ప్రభుత్వం వివరణలను ఇచ్చి బీసీ బిల్లులను పంపినా కేంద్రం తిరకాసు పెట్టి నట్టు తెలిసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ, ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు 50శాతం సీలింగ్ పరిధిలోకి రాబోవని చెప్పినట్టు తెలిపింది. అదీగాక బీసీల వెనకబాటుతనాన్ని దేని ఆధారంగా నిర్ధారించారు? గణాంకాలకు ఉన్న సాధికా రత తదితర అంశాలపై వివరణ కోరుతూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీ వల ఒక హోటల్లో ప్రత్యేకంగా కొంతమంది అధికారులు, మంత్రులతో సమావేశమై చర్చించినట్టు తెలిసింది. కేంద్రం అడిగిన వివ రాల నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృ త్వంలో ఏర్పాటుచేసిన స్వతంత్ర కమిటీ నివే దికను తెప్పించుకున్నట్టు తెలుస్తున్నది. తాజాగా ఆ నివేదికను కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.