టెహ్రాన్: తన యుద్ధనౌకపై జలాంతర్గామితో అమెరికా దాడి చేసి సముద్రంలో ముంచేయడంపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకున్నది. అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ షిప్‌పై దాడి చేసింది. (Iran hits US tanker) గురువారం ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ట్యాంకర్‌పై క్షిపణులతో ఎటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఇరాన్ దాడి వల్ల అమెరికా ఆయిల్ ట్యాంకర్లో మంటలు వ్యాపించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ దేనా వార్‌షిప్ భారత్‌లో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్నది. ఆ తర్వాత ఇరాన్‌కు అది బయలుదేరింది. మంగళవారం రాత్రి శ్రీలంక తీరం సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఆ ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి చేసింది. టార్పెడ్తో ఎటాక్ చేయడంతో ఇరాన్ యుద్ధనౌక దేనా రెండు ముక్కలై సముద్రంలో మునిగిపోయింది.
మరోవైపు అందులో ఉన్న 130 మందికిపైగా సిబ్బందిలో 87 మంది నావికులు మరణించారు. గాయపడిన కొంతమందిని శ్రీలంక నేవీ కాపాడింది. సుమారు 36 మంది ఇరాన్ నావికులు ప్రస్తుతం శ్రీలంకలో చికిత్స పొందుతున్నారు.
అయితే అమెరికా పాల్పడిన ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
Just In 🚨🚨🇮🇷🇮🇳Footage obtained by Reuters shows the Skylight oil tanker — a vessel sanctioned by the U.S Treasury Department last year — after it was hit by a projectile off the coast of Oman, according to Omani security officials.#IranWar . pic.twitter.com/izycpjHTpW
— IndicWisdom (@rickel22325) March 5, 2026
Also Read:
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Iranian warship | శ్రీలంక తీరంలో ఇరాన్ రెండో యుద్ధ నౌక.. దీన్ని కూడా పేల్చేస్తారా
Azerbaijan: అజర్బైజాన్ ఎయిర్‌పోర్టుపై పడిన డ్రోన్.. ఇరాన్ అంబాసిడర్‌కు సమన్లు.. వీడియో