బాకు: ఇరాన్‌కు చెందిన డ్రోన్లు, క్షిపణులు.. అజర్బైజాన్లో పడ్డాయి. ఇరాన్ బోర్డర్ దేశమైన అజర్బైజాన్(Azerbaijan)లోని నక్చివాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుపై ఇవాళ ఓ డ్రోన్ పడింది. బోర్డర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఆ పట్టణం ఉన్నది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు, డ్రోన్లు దూసుకు వస్తున్నట్లు అజర్బైజాన్ ప్రభుత్వం పేర్కొన్నది. ఎయిర్‌పోర్టులో కూలిన ఓ డ్రోన్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఇరాన్ రెండు డ్రోన్లను వదిలినట్లు అజర్బైజాన్ ఆరోపించింది. ఈ ఘటనకు ఇద్దరు గాయపడినట్లు చెప్పింది.
తమ నిరసన వ్యక్తం చేసేందుకే ఇరాన్ అంబాసిడర్‌కు సమన్లు జారీ చేసినట్లు అజర్బైజాన్ వెల్లడించింది. నక్చివాన్ విమానాశ్రయంలో ఓ డ్రోన్ పడినట్లు అజర్బైజాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. మరొకటి ఓ స్కూల్లో పడినట్లు తెలిపారు. ఓ ప్రకటనలో ఈ ఘటనను ఆయన ఖండించారు. ఇరాన్ దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే ఇరాన్ నుంచి మాత్రం ఎటువంటి కామెంట్ రాలేదు.
BREAKING: Iranian drone hits Nakhchivan, Azerbaijan. pic.twitter.com/waWvQPYoF4
— Clash Report (@clashreport) March 5, 2026