Premalu | మాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచి తెలుగులో విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం ప్రేమలు (Premalu) . కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీలో డబ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఊహించని విధంగా యూజర్స్‌కు హిందీ వెర్షన్ అందుబాటులో లేకుండా పోయింది. ప్రేమలు హిందీ వెర్షన్‌ను జియో హాట్ స్టార్ నుంచి తొలగించారు. దీనిక్కారణమేంటనే కదా మీ డౌటు.
వివిధ ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాలు హిందీలో తెరకెక్కుతుంటాయని తెలిసిందే. ఇప్పుడు ప్రేమలు కూడా హిందీలో రాబోతుంది. Prem Keetanu అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో వీర్ పహారియా, ఆఫియా సయద్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. హిందీ రీమేక్ థియేటర్లలోకి రానుండటంతో మేకర్స్ ప్రేమలు హిందీ వెర్షన్‌ను జియో హాట్ స్టార్ నుంచి తొలగించారు.
హిందీ రీమేక్ విడుదలయ్యే వరకు ప్రేక్షకులకు ప్రేమలు హిందీ వెర్షన్‌ను చూసే అవకాశం లేదన్నమాట. మరి హిందీలో రీమేక్ చేస్తున్న Prem Keetanu ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తి కరంగా మారింది. అవనికా ఫిల్మ్స్, ఫార్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరవ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌ను నేటి నుంచి షురూ అయ్యాయి.