మొక్కలతో మన భవిష్యత్ : షీ టీం ఎస్ఐ రమాదేవి
నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్రత, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
రుద్రంపూర్, ఆగస్టు 17 : నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్రత, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. “మొక్కను నాటడం అంటే కేవలం ఒక మొక్కను భూమిలో నాటడం కాదని మన భవిష్యత్‌ను నాటడం” అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని స్నేహితుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. పిల్లల భద్రతపై అవగాహన కల్పిస్తూ సేఫ్ టచ్, అన్‌సేఫ్ టచ్ గురించి వివరించారు. ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, వెంటపడినా లేదా బెదిరించినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. సమస్యలను మనసులో పెట్టుకుని మౌనంగా ఉండకూడదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

