చెన్నై: ప్రియురాలు మాట్లాడక పోవడంపై ఒక యువకుడు ఆగ్రహించాడు. మద్యం సేవించిన అతడు ఆమె ఇంటి సమీపంలో పెట్రోల్ బాంబు విసిరాడు. అయితే అది వెనక్కి వచ్చి అతడి పక్కనే పేలింది. ఆ వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Throws Petrol Bomb) తమిళనాడులోని మదురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల నాగార్జున ఒక యువతితో ఆరేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్నాడు. అయితే గత వారం రోజులుగా అతడితో మాట్లాడటానికి ప్రియురాలు నిరాకరించింది. దీంతో ఆమెపై అతడు ఆగ్రహంతో ఉన్నాడు.
కాగా, మద్యం మత్తులో ఉన్న నాగార్జున తన ప్రియురాలు మాట్లాడకపోవడంపై అసహనానికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఇంటి సమీపంలో పెట్రోల్ బాంబు విసిరాడు. అయితే గోడకు తగిలిన ఆ పెట్రోల్ బాంబు అతడి పక్కనే పడి పేలింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. నిందితుడ్ని 23 ఏళ్ల నాగార్జునగా గుర్తించి అరెస్ట్ చేశారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రేమికురాలు వారం రోజులుగా మాట్లాడటానికి నిరాకరించడంతో మద్యం మత్తులో ఉన్న అతడు అసహనానికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
பெட்ரோல் குண்டு வீசியவரின் தலையில் பற்றிய தீ | Madurai | Petrol Bomb | Fire Accident | Kumudam News#Madurai #PetrolBomb #PetrolBombAttack #FireAccident #MaduraiNews #CrimeNews #TamilNadu #TamilNews #ViralVideo #KumudamNews #KumudamNews24x7 pic.twitter.com/i83W8EIc55
— Kumudam News 24×7 (@kumudamNews24x7) September 4, 2026