ముంబై: లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళలు కృష్ణాష్టమి వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. డ్యాన్సులు చేయడంతో పాటు ఉట్టిని పగులగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. (Janmashtami Celebration In Train ) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బద్లాపూర్-థానే లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళలు కృష్ణాష్టమి సందర్భంగా ఆ వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. మహిళా కోచ్‌ను బెలూన్స్, ఇతర వస్తువులతో అందంగా డెకరేట్ చేశారు. రైలు పైభాగంలో ఉండే హ్యాండిల్‌కు ఉట్టిని కూడా వేలాడదీశారు.
కాగా, ఆ లేడీస్ కోచ్‌లోని మహిళా ప్రయాణికులు పాటలు, డ్యాన్సులతో సందడి చేశారు. ఆ తర్వాత ఒక మహిళపైకి ఎక్కిన యువతి చాలా సేపు ప్రయత్నించిన తర్వాత ఉట్టిని పగులగొట్టింది. ఆ కోచ్‌లోని మహిళలు కేరింతలు కొడుతూ దీనిని ఆస్వాదించారు. ఆ తర్వాత కూడా పాటలు, డ్యాన్సులతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రోజువారీ ప్రయాణంలోనూ జన్మాష్టమిని విభిన్నంగా జరుపుకోవాలన్న ఆ మహిళల ఉత్సాహాన్ని కొందరు ప్రశంసించారు. అయితే కదులుతున్న రైలులో ఇలాంటి వేడుకలు జరుపడం సబబేనా అని మరికొందరు ప్రశ్నించారు. లోకల్ ట్రైన్ కోచ్‌లో మహిళా ప్రయాణికుల కృష్ణాష్టమి సెలబ్రేషన్‌పై రైల్వే ఇంకా స్పందించలేదు.
Is there any end of such “Reel Stupidity”
Now, Dahi Handi inside Local train.
That too when Mumbai local train is already overcrowded always. pic.twitter.com/ikg41Vmh6E
— Dear Men (@Dear_Men_Life) September 4, 2026