KTR | రోగులను కాపాడటం మీకు ఎలాగూ చేతకాదు, కనీసం మేమైనా కాపాడుకుంటాం అని ప్రయత్నిస్తే మా వినయ్ భాస్కర్‌ను కొడతారా? అసలు మీరు మనుషులేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్పై పోలీసులు ఓవరాక్షన్ పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిన్న(మంగళవారం) వరంగల్ ఎంజీఎం దవాఖానను సందర్శించేందుకు వెళ్తున్న ఆయనపై విచక్షణ లేకుండా దాడి చేసి రక్తం కండ్లజూశారు. భుజాలపై చేతులు వేసి, మోకాళ్లతో నెట్టడంతో ‘అమ్మా.. అమ్మా’ అని వినయ్‌భాస్కర్ తల్లడిల్లుతున్నా.. పోలీసులు మాత్రం నిలువరించే పేరుతో కడుపులో పిడిగుద్దులు కురిపిస్తూ క్రూరంగా ప్రవర్తించారు.
ఈ ఘటనలో వినయ్‌భాస్కర్ కాలు, చేయికి గాయాలై రక్తస్రావమైంది. తీవ్ర ఉద్రిక్తతలతో భయోత్పాతాన్ని సృష్టించిన ఈ ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచిందన్నారు. ఎంజీఎంలో పై కప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజల తరఫున దవాఖానలో కనీస సౌకర్యాలు కల్పించాలని అడిగిన వారిపై అమానుషంగా దాడి చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడుపలేరని, లాఠీలు, తూటాలకు బీఆర్ఎస్ భయపడదన్నారు. కాంగ్రెస్ అసమర్ద పాలనను ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Shame on @TelanganaCOPs for trying to cover up the facts of deteriorating conditions in MGM hospital
రోగులను కాపాడటం మీకు ఎలాగూ చేతకాదు, కనీసం మేమైనా కాపాడుకుంటాం అని ప్రయత్నిస్తే మా వినయభాస్కర్ గారిని కొడతారా?
అసలు మీరు మనుషులేనా?? https://t.co/KAJAKOIeSC— KTR (@KTRBRS) September 23, 2026