West Bengal | హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం.. మరికొందరికి గాయాలు
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక హోటల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగాల్, బీర్భూమ్ జిల్లా, తారాపీట్లోని ఒక హోటల్లో సోమవారం వేకువజామున జరిగింది.
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక హోటల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బెంగాల్, బీర్భూమ్ జిల్లా, తారాపీట్లోని ఒక హోటల్లో సోమవారం వేకువజామున జరిగింది. కస్టమర్లు, సిబ్బంది గాఢ నిద్రలో ఉండగా, ఉదయం 4.00 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తారాపీట్.. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి దేవాలయానికి భక్తులు భారీగా వస్తుంటారు. ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో భక్తులు భారీగా వచ్చారు.
దీంతో వారితో హోటల్ నిండిపోయింది. ఇది నాలుగంతస్తుల బిల్డింగ్. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. హోటల్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న రిసెప్షన్లో మొదట మంటలు చెలరేగాయి. తర్వాత బిల్డింగులోని ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. ఈ క్రమంలో ముందుగా పొగ భారీగా విస్తరించింది. తర్వాత మంటలు కూడా వ్యాపించాయి. మంటల ప్రభావంతో వైర్లు కాలిపోవడంతో హోటల్లో లైట్లు పూర్తిగా ఆరిపోయాయి. మంట, పొగల ధాటికి ఉలిక్కిపడి మేల్కొన్న కస్టమర్లు అక్కడినుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. చీకట్లో మంటల నుంచి బయటపడటం కష్టమైపోయింది. పై అంతస్తుల్లోని వారు ఎలాగోలా, మెట్ల మార్గంలో కిందికి రావడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడా మంటలు వ్యాపించాయి. అయినప్పటికీ తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో కొంత తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఇంకొందరు మంటల్లోంచే బయటపడ్డారు. వారి శరీరం కూడా తీవ్రంగా కాలిపోయింది. పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. కొందరు లోపలికి రాలేక లోపలే చిక్కుకుపోయారు. అలా, ఐదుగురు వ్యక్తులు లోపలే మంటలకు మాడిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బాధితుల్ని రక్షించే సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం రాంపూర్హత్లోని ఆస్పత్రులకు తరలించారు.
హోటల్ రిసెప్షన్లో ఒక ఏసీకి సంబంధించిన స్విచ్‌లో మంటలు చెలరేగాయని, ఈ ఫ్లోర్లో ఫైబర్‌తో తయారైన ఇంటీరియర్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని హోటల్ యజమాని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

