F-35 Fighter Jet | ఎట్టకేలకు బ్రిటన్ ఫైటర్ జెట్‌కు పూర్తైన మరమ్మతులు.. నేడు ట్రయల్ ఫ్లైట్‌కు ఏర్పాట్లు
F-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి.
F-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి. యుద్ధ విమానం హైడ్రాలిక్ సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని బ్రిటిష్ ఇంజనీర్ల బృందం విజయవంతంగా సరిచేసింది. అనంతరం విమానాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మరమ్మతులు విజయవంతం కావడంతో నేడు ట్రయల్ ఫ్లైట్ (trial flight) నిర్వహించేందుకు నిపుణులు సన్నాహకాలు చేస్తున్నారు. అనంతరం ఇది యూకేకి ఎగిరిపోనుంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో (Fighter jets) ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) 40 రోజులుగా కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్-35బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు.
విమానానికి మరమ్మతులు చేయడానికి అదేరోజు రాత్రి ఏడబ్ల్యూ 101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు చేసినా విమానం మొరాయించింది. అప్పటి నుంచి తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోనే ఉంది. ఆ తర్వాత పరికరాలతో సహా 24 మంది స్పెషల్ ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి విమానానికి మరమ్మతులు చేపట్టింది. వారు చేపట్టిన మరమ్మతులు విజయవంతం కావడంతో విమానాన్ని హ్యాంగర్ నుంచి బయలకు తరలించారు. ఇవాళ ట్రయల్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఇది యూకేకు వెళ్లనుంది. ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది.
Also Read..
Heavy Rain | ముంబైని ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన సబ్‌వేలు.. ఐఎండీ హెచ్చరికలు
Lok Sabha | పహల్గాం ఉగ్రదాడిపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ వాయిదా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

