IndiGo | తిరుపతి (Tirupati) నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక లోపం (technical glitch) తలెత్తింది. దీంతో విమానం దాదాపు 40 నిమిషాల పాటూ గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరిగొచ్చింది.
ఫ్లైట్రాడార్ 24 ప్రకారం.. ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ 6E 6591 విమానం ఆదివారం రాత్రి 7:20 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో ఎయిర్‌లైన్స్ విమానాన్ని రీషెడ్యూల్ చేసింది. దీంతో విమానం 7:42 సమయంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌నుంచి బయల్దేరింది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన అనంతరం సాంకేతిక సమస్య తలెత్తింది. దాదాపు 40 నిమిషాల పాటూ గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. చివరికి 8:34 గంటల సమయంలో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరిగొచ్చింది. అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.
Also Read..
Heavy Rain | ముంబైని ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన సబ్‌వేలు.. ఐఎండీ హెచ్చరికలు
Lok Sabha | పహల్గాం ఉగ్రదాడిపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ వాయిదా
PM Modi | ఆపరేషన్ సిందూర్ విజయంతో ప్రపంచం దృష్టి మొత్తం మేడిన్ ఇండియా ఆయుధాలపైనే : ప్రధాని మోదీ