Heavy Rain | ముంబై (Mumbai)ని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. అంధేరిలో రద్దీగా ఉండే సబ్‌వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో అంధేరీ సబ్వే (Andheri Subway)ని అధికారులు మూసివేశారు.
ముంబై, రాయ్‌గఢ్‌లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. థానే, పాల్ఘర్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల పాటు ముంబై, కొంకణ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై సమీప ప్రాంతాల ప్రజలు సముద్ర తీరానికి వెళ్లొద్దని హెచ్చరించారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు.
భారీ వర్షాలు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇండిగో, స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని.. ప్రయాణికులు షెడ్యూల్ టైమ్ కంటే కాస్త ముందే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని సూచించాయి.
#WATCH | Heavy downpour in Mumbai affects commuters as they wade through waterlogged streets in the Andheri area of the city pic.twitter.com/QiwtqI9aK3
— ANI (@ANI) July 21, 2025
Also Read..
Lok Sabha | పహల్గాం ఉగ్రదాడిపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్‌సభ వాయిదా
PM Modi | ఆపరేషన్ సిందూర్ విజయంతో ప్రపంచం దృష్టి మొత్తం మేడిన్ ఇండియా ఆయుధాలపైనే : ప్రధాని మోదీ
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. విపక్షాల వాయిదా తీర్మానాలు