ఇటీవలే విడుదలైన లెవెన్త్ హవర్, నవంబర్ స్టోరీ వెబ్ ప్రాజెక్టుల్లో లీడ్ రోల్ పోషించింది మిల్కీ బ్యూటీ తమన్నా. మరోవైపు సీటీమార్, ఎఫ్ 3 సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట తమన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది. సొంత వాయిస్ తో డబ్బింగ్ చెబితే తన పాత్రల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకున్నానని చెప్పపింది.
ఈ రెండు సినిమాలతోపాటు నితిన్ హీరోగా నటిస్తోన్న మ్యాస్ట్రోలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధాధున్ కు ఇది తెలుగు రీమేక్. హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా పోషిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో తమన్నా-గోపీచంద్ కాంబినేషన్ లో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సీటీమార్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా..వాయిదా పడ్డది.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!