Namibian cheetah | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది (birth to 4 cubs). మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని కూనో నేషనల్ పార్క్ (Kuno National Park)లో నమీబియా చిరుత (Namibian cheetah)కు నాలుగు పిల్లలు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ధృవీకరించారు. చిరుత పిల్లల చిత్రాలను, వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.
భారతదేశంలో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా (Project cheetah) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు.
ఎనిమిదింట్లో ఆడ చీత (female cheetah) సాషా (Sasha) సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో సాషా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సాషా మృతి చెందిన రెండు రోజుల్లోనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పరిణామంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు జన్మించాయి.
మనదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. ఈ క్రమంలో దేశంలో చిరుతలు పూర్తిగా అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది. అంతరించి పోయిన చిరుతల సంతతిని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది.
Congratulations 🇮🇳
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
Welcome to the World!
One of the #Cheetahs translocated to India last year, has given birth to four cubs at the Kuno National Park in Madhya Pradesh.
What an adorable sight! pic.twitter.com/2IIKmiSH2J
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 29, 2023
Also Read..
Amritpal Singh | పోలీసుల ఎదుట లొంగిపోయే యోచనలో ఖలిస్థాన్ నేత
Karnataka Elections | మోగిన ఎన్నికల నగారా.. 100 ఏండ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా..?
Taapsee Pannu | తాప్సీపై కేసు నమోదు.. ఓ మతాన్ని అవమానించేలా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు