Ashraf Ahmed | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన పేరుమోసిన నేరగాడు, గ్యాంగ్‌స్టర్ (gangster), సమాజ్‌వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్(Atiq Ahmed) సోదరుడు అష్రాఫ్ అహ్మద్(Ashraf Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు వారాల్లో తనని చంపేస్తానంటూ ఓ సీనియర్ అధికారి బెదిరించాడని ఆరోపించారు.
2006లో ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసు (Umesh Pal Kidnap Case)లో అష్రాఫ్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అతడు నిర్దోషిగా తేలాడు. ప్రస్తుతం అతడిని బరేలీ జైలు (Bareilly jail) కు తరలించగా.. అతీక్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలు (Gujarat Sabarmati jail)కు తరలించారు. ఈ సందర్భంగా అష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘రెండు వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తానని ఒక సీనియర్ అధికారి నన్ను బెదిరించాడు. నాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. నాపై పెట్టిన తప్పుడు కేసులతో నేను పడుతున్న బాధను ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు’ అని అష్రాఫ్ వ్యాఖ్యానించాడు. అయితే ఆ అధికారి ఎవరని ప్రశ్నించగా.. తాను పేరు చెప్పలేనన్నాడు. అతని పేరును ముఖ్యమంత్రి ( UP Chief Minister Yogi Adityanath), భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) , అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తి ( Chief Justice of Allahabad)కి వెల్లడిస్తానని చెప్పాడు.
కాగా, 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకు అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2006 ఫిబ్రవరి 28న అతీక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ కలిసి ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం విడుదలైన ఉమేష్‌పాల్ 2007లో అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు అతడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అష్రాఫ్ నిర్దోషిగా తేలాడు. అతీక్ అహ్మద్‌ను యూపీ ప్రయాగ్ రాజ్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు జీవిత ఖైదు విధించింది.
Also Read..
Mallikarjun Kharge | అవినీతిపరుల కూటమికి మోదీ నాయకుడు.. ప్రధానిపై ఖర్గే ఫైర్
Taapsee Pannu | తాప్సీపై కేసు నమోదు.. ఓ మతాన్ని అవమానించేలా ప్రవర్తించిందంటూ ఫిర్యాదు
ChatGPT | నిందితుడి బెయిల్ పిటిషన్‌పై.. చాట్‌జీపీటీని న్యాయ సలహా కోరిన కోర్టు..!