Amritpal Singh | పోలీసుల ఎదుట లొంగిపోయే యోచనలో ఖలిస్థాన్ నేత
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల ఎదుట లొంగిపోయే యోచనలో ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని రాష్ట్రం వీడి పారిపోయిన అతను.. తిరిగి పంజాబ్‌లో అడుగుపెట్టాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్‌పాల్ ఉన్నట్లు భావిస్తున్న కారును పంజాబ్ పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. నిందితుడు కారు వదిలి పరిసర గ్రామాల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఖలిస్థాన్ నేత కోసం ఆ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు.
కాగా, అమృత్‌పాల్ సింగ్ పోలీసుల ఎదుట లొంగిపోయే యోచనలో ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అతను లొంగిపోయే ముందు ఒక అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించాయి. అయితే, తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన అమృత్‌పాల్.. చివరకు తన మనసు మార్చుకున్నట్లు వారు పేర్కొన్నారు.
మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమృత్‌పాల్ ఉన్న ఇన్నోవా కారును మార్నియన్ (Marnaian) సమీపంలోని ఫగ్వారా (Phagwara) – హుషియర్‌పూర్ (Hoshiarpur ) హైవే సమీపంలో పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. హుషియర్పూర్లోని మార్నియన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును వదిలిపెట్టి అక్కడి పొలాల్లోకి పారిపోయాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖలిస్థాన్ నేత కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానితుల్ని పట్టుకునేందుకు రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Also Read..
Karnataka Elections | మోగిన ఎన్నికల నగారా.. 100 ఏండ్లు పైబడిన ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

