Amritpal Singh | మళ్లీ పంజాబ్ తిరిగొచ్చిన అమృత్‌పాల్ సింగ్.. ? ఖలిస్థాన్ నేత కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
mritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని రాష్ట్రం వీడి పారిపోయిన అతను.. మారువేషాల్లో తిరుగుతున్నాడు. మతపరమైన సంప్రదాయ దుస్తులు కాకుండా.. వేషాలు మార్చి తిరుగుతున్నాడు. హర్యానా (Haryana), పాటియాలా (Patiyala), ఢిల్లీ (Delhi) తదితర ప్రాంతాల్లో దాక్కున్న అతడి జాడ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అతడు భారత సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లాడని పోలీసు వర్గాలు భావించాయి. అక్కడి నుంచి నకిలీ పాస్‌పోర్ట్ ఆధారంగా విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, తాజా సమాచారం ప్రకారం.. అమృత్‌పాల్ తిరిగి పంజాబ్ చేరుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అమృత్‌పాల్ ఉన్న ఇన్నోవా కారు మార్నియన్ (Marnaian) సమీపంలోని ఫగ్వారా (Phagwara)-హుషియర్‌పూర్ (Hoshiarpur ) హైవే సమీపంలో పోలీసులు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్‌పాల్ ఉన్నట్లు భావిస్తున్న కారును పంజాబ్ పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. నిందితుడు కారు వదిలి పరిసర గ్రామాల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఖలిస్థాన్ నేత కోసం పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.
Also Read..
Gutha Sukender Reddy | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: మండలి చైర్మన్ గుత్తా
Hyderabad | నడి వయసు మగాళ్లే వాళ్ల టార్గెట్.. రద్దీ బస్సుల్లో మక్కన్ ముఠాకు చిక్కితే అంతే!
Indore | హోటల్లో అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

