Indore | హోటల్లో అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh) ఇండోర్‌లో (Indore) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండోర్‌లోని ఓ ఐదంతస్తుల హోటల్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు (Fire accident) అంటుకున్నాయి.
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh) ఇండోర్‌లో (Indore) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండోర్‌లోని ఓ ఐదంతస్తుల హోటల్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు (Fire accident) అంటుకున్నాయి. క్రమంగా అవి హోటల్లోని రెండు అంతస్తులకు విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. హోటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి యత్నిస్తున్నారు. ఓ మహిళ, ఇద్దరు చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, మహారాష్ట్రలోని (Maharashtra) దాదర్ ఈస్ట్‌లో (Dadar East) ఉన్న నైగావ్ ప్రాంతంలో ఫర్నీచర్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

